కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాజకీయాలను తాను మునుగోడు (Munugode) నుంచి శాసించే రోజు త్వరలోనే వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) అన్నారు. చండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఇక్కడి ఓటుకు విలువ పెరిగిందని తెలిపారు. తన ఎమ్మెల్యే పదవి త్యాగం వల్ల తనకు అన్యాయం జరిగినా.. మునుగోడు ప్రజలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. దోపిడీకి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ముందుంటానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజా పాలనలో రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) వివరించారు. చండూరు మున్సిపాలిటీలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమిని గుర్తించి ఇండ్లు కట్టిస్తానని హామీనిచ్చారు. చండూరులో ఇప్పటివరకు 10 శాతం అభివృద్ధి మాత్రమే జరిగిందని, ఇంకో 90 శాతం అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ‘నా బలం… బలగం మునుగోడు ప్రజలు మీరు నా వెంట ఉంటే ఎంత దూరమైనా వెళ్తా కొట్లాడుతా’ అని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభ చూసిన తర్వాత ప్రత్యర్థి వాళ్లకి ఓటు అడగాలన్నా భయపడుతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాబలం కలిగిన నేత రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతవ్వాలని, మునుగోడు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిగా అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: సీఎంలే మా దగ్గరకు వస్తారు : ఎమ్మెల్యే అక్బరుద్దీన్
Follow Us On: X(Twitter)


