కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం (NDA Parliamentary Meeting) ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని లైబ్రరీ హాల్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మోదీ ఎంపీలతో సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, ప్రతిపక్షాల ఆందోళన, ఎన్డీఏ వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

