నేడు ప్రధాని మోడీ ఇంటి వరకు కేజ్రీవాల్ పాదయాత్ర

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ -20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆప్ పార్టీ నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని ప్రధాని మోడీ (PM Modi) నివాసం వరకు మార్చ్ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ-20 పెట్రోల్ కు వ్యతిరేకంగా 2 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్‌ను ప్రధానికి అందజేయాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) భావిస్తున్నారు.

ఈ-20 పెట్రోల్ వాడకం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేదని.. పైగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ-20 పెట్రోల్ ఎందుకు వాహనదారులు వాడాలని ఆయన ప్రశ్నించారు. ఇథనాల్ విధానం ఎందుకు లోపభూయిష్టంగా ఉందో ప్రధాని మోడీతో చర్చించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఈ నిరసన ప్రదర్శన భారీగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటె లాఠీ దెబ్బలకు భయపడని తన లాంటి 100 మందిని మాత్రమే ఈ ర్యాలీకి తీసుకెళ్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

ఈ -20 పెట్రోల్ వినియోగం విషయంలో కేంద్రాన్ని ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నామని అన్నారు. స్వచ్ఛమైన పెట్రోల్ వాడాలో లేక ఈ -20 పెట్రోల్ వాడాలో నిర్ణయించుకునే హక్కు వాహనదారులకు మాత్రమే ఉండాలని తెలిపారు. ఒకవేళ ఈ -20 పెట్రోల్ ప్రభుత్వం తప్పనిసరి చేయాలనుకుంటే అది సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గటంతో దేశంలో లీటర్ పెట్రోల్ రూ.84 కంటే తక్కవ ధరకే అందించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>