రీల్స్ పిచ్చి.. తుపాకీతో కాల్చుకొని చనిపోయిన యువకుడు

కలం, వెబ్​ డెస్క్​ : సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో రీల్స్ పిచ్చి మరింతగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రీల్స్ మోజులో పడిపోతున్నారు. సెల్ఫీ ట్రెండ్ నుంచి ఇప్పుడు రీల్స్ తీసుకొని ఫేమస్ అవుదాం అనుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొండలపైనుంచి దూకడం, ప్రమాదకమైన చోటులో రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. రైలు వస్తుండగా వీడియో తీస్తూ క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళెందరో. తాజాగా ఓ వ్యక్తి రీల్స్ తో ఫేమస్ అవుదామని పిచ్చి ప్రయోగం చేశాడు. ఏకంగా తుపాకితోనే ఆటలాడి క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో రీల్స్ పిచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన స్నేహితుడు వీడియో తీస్తుండగా, పవన్ అనే యువకుడు గన్‌ను లోడ్ చేస్తూ స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు. ఆ గన్‌ను కాల్చవద్దని స్నేహితుడు హెచ్చరిస్తున్నప్పటికీ, అతను వినకుండా తన ఛాతిపైనే కాల్చుకున్నాడు. బుల్లెట్ నేరుగా గుండెలోకి దూసుకుపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీల్స్ మోజులో చిన్నపిల్లలు కూడా ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందని పిల్లలను పేరెంట్స్ ఎప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత ఫోన్ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Read Also: చికెన్​ ప్రియులు జాగ్రత్త.. అక్కడంతా కుళ్లిన మాంసమే!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>