భద్రాచలంలో రామదాసు వంశీయులకు నో ఎంట్రీ

కలం, ఖమ్మం బ్యూరో :  శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినం సందర్భంగా భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భక్త రామదాసు వంశీయులను (Ramadasu Descendants) ఆలయంలోకి అనుమతించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆలయ నిర్మాణానికి కారణమైన తమ వంశీయులకే ప్రవేశం నిరాకరించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ముందుగా పాస్‌లు ఇచ్చి, ఇప్పుడు అవి చెల్లవని చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే సమయంలోనే స్పష్టతతో పాస్‌లు జారీ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేదని తెలిపారు. ప్రభుత్వం భద్రాచలం కళ్యాణం సందర్భంగా సెక్టార్ల వారీగా పాస్‌లు జారీ చేసింది. ఆ మేరకు రామదాసు వంశీయులు మిథిలా స్టేడియంలో తిరుకళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాన ఆలయానికి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా వంశీయులు మాట్లాడుతూ, ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని, మొదటిసారి పోలీసులు అడ్డుకోవడం బాధ కలిగించిందని తెలిపారు. ఆలయాన్ని నిర్మించిన వారికే అదే ఆలయంలోకి అనుమతి లేకపోవడం ఎలా సాధ్యమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీరామనవమి వంటి పవిత్ర రోజున రామదాసు వంశీయులకు ఇలా జరగడం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>