కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేసింది. సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులతో సహా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా అంబర్ కిషోర్ ఝా, ఎస్.ఎం విజయ్ కుమార్, రితురాజ్, నారాయన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కే.ఎస్.రావు, వెంకటగిరి, నాగేందర్ రావు, శ్రీధర్ ఉన్నారు. కాగా, రేపు (శుక్రవారం) ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) పై సుప్రీం కోర్టులు తీర్పు ఉన్న నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.


