కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండె పోటు (Cardiac Arrest)తో విధి నిర్వహణలోనే ఓ కానిస్టేబుల్ (Constable) ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఫిలింనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులేషు అనే కానిస్టేబుల్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం డ్యూటీలో ఉండగా బ్రేక్ ఫాస్ట్ కోసం పక్కనే హోటల్‌కు వెళ్లారు. హోటల్ లోపలికి వెళ్తుండగానే ఉన్నట్టుండి ఓబులేశు కుప్పకూలిపోయారు.
గమనించిన హోటల్ సిబ్బంది, స్థానికులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే ఓబులేశు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఓబులేశు ఆకస్మిక మరణం పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓబులేశు హోటల్ ముందుకు కుప్పకూలిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కానిస్టేబుల్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

