Mobile Popup Ad
Mobile Popup Ad

చక్కెరను పూర్తిగా మానేస్తున్నారా? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ నిజాలు

కలం, వెబ్ డెస్క్: బరువు తగ్గడానికి, మధుమేహం రాకుండా ఉండటానికి ఆహారంలో చక్కెరను (Sugar) పూర్తిగా దూరం పెట్టడం మంచిదని చాలామంది భావిస్తారు. అయితే ఒక్కసారిగా చక్కెరను మానేయడం వల్ల జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. శరీరంలో వాపులు జీవక్రియ లోపాలు వచ్చే ప్రమాదం ఉందని షికాగోలో జరిగిన ‘ఎండో 2026′ జరిగిన సమావేశంలో నిపుణులు వెల్లడించారు. ఎలుకలపై 16 వారాలపాటు జరిపిన ప్రయోగంలో చక్కెర లేని ఆహారాన్ని తీసుకున్న ఎలుకల్లో చక్కెర నియంత్రణ తగ్గడం, ఫ్యాటీ లివర్ సంకేతాలు కనిపించాయని తెలిపారు. చక్కెరను పూర్తిగా మానేయడం కంటే సమతుల్య ఆహారం తీసుకోవడమే ముఖ్యమంటున్నారు.

జీర్ణవ్యవస్థలో ఉండే ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు (గట్ మైక్రోబయోమ్) జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ పరిశోధన ప్రకారం.. ఆహారం నుంచి సుక్రోజ్‌ను పూర్తిగా తీసేయడం వల్ల బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా పేగులు, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి చక్కెరను పూర్తిగా మానేయడం సరైన పద్ధతి కాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా చక్కెరను పూర్తిగా మానేయమని చెప్పడం లేదని ప్రస్తావించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>