కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మున్సిపాలిటీల పాలకవర్గం ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక దాదాపు పూర్తయింది. కానీ, కోరం లేకపోవడం, హంగ్ ఫలితాలు వచ్చిన కారణంగా 8 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ రేపటికి (మంగళవారం) వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ మిగిలిన మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడానికి వ్యూహాలను పన్నుతోంది. నేతలు, నాయకులు, అభ్యర్థులను సమన్వయం చేసుకోవడానికి చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డ మున్సిపాలిటీలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పరిశీలకులను నియమించారు.
తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజును నియమించారు. ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణలకు జనగాం బాధ్యతలను అప్పగించారు. ఇబ్రహీం మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్. క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిశీలకులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియమించింది. ఇంద్రేశం మున్సిపాలిటీ ఎమ్మెల్యేలు పీ.రామ్మోహన్ రెడ్డి, శ్రీగణేష్. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నియమించింది. మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి లకు జహీరాబాద్ మున్సిపాలిటీ బాధ్యతలను టీపీసీసీ చీఫ్ (Mahesh Kumar Goud) అప్పగించారు.


