హనుమకొండలో బండి సంజయ్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ నిరసన

కలం, హనుమకొండ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ (Hanumakonda) కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రావడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. ఫోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ కూడా పాల్గొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>