కలం, నిర్మల్: పాఠశాలకు ప్రహరీ గోడ(School Compound Wall) లేకపోవడంతో నిత్యం భయాందోళనల మధ్య చదువుకోవాల్సి వస్తోందని నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (Akkapur School Students) శశాంక్, హర్షవర్ధన్, ఆకాష్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి పాములు వస్తున్నాయని, గతంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు సైతం పాముకాటుకు గురైందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని, ఏదైనా ప్రమాదం జరగకముందే స్పందించి పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరారు.

