ట్రంప్‌నకు సరెండయిన మోడీ : ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో : నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్‌నకు సరెండర్​ అయ్యారని, రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మైక్ ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లామని, అందుకే కావాలని 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారన్నారు. బీజేపీ మా నోరు మూయించాలనే ప్రయత్నం చేస్తోందని, మిగతా ఎంపీలందరూ మా తరపున సభలో ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పారు.

పార్లమెంటు ఆవరణలో సస్పెన్షన్ గురైన 8 మంది ఎంపీలం బుధవారం ఆందోళన చేస్తామని తెలిపారు. స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారు అనేది మేం చూడలేదని, మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశామన్నారు. మేం మాట్లాడుతుంటే.. మైకులు కట్ చేస్తున్నారని, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారని, కానీ దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బిజెపి ప్రచారం చేస్తున్నారని చామల (MP Chamala Kiran Kumar) చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>