epaper
Wednesday, February 18, 2026
epaper

డీఆర్​డీవో ‘రామ్​జెట్​ టెక్నాలజీ’ మిస్సైల్​ సక్సెస్

కలం, వెబ్​డెస్క్​: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ​మరో ఘనత సాధించింది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించి, లక్ష్యాలను ఛేదించగలిగే లాంగ్​రేజ్​ గైడెడ్​ మిస్సైల్స్ తయారీలో కీలకమైన రామ్​జెట్​ టెక్నాలజీని సక్సెస్​ఫుల్​గా పరీక్షించింది (DRDO – Ramjet). మంగళవారం ఒడిశాలోని చాందీపూర్​లో ఉన్న ఇంటెగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్​(ITR​) నుంచి ఈ ప్రయోగం విజయంతంగా నిర్వహించింది. ‘సాలిడ్​ ఫ్యూయల్​ డక్టెడ్​ రామ్​జెట్​’(SFDR) టెక్నాలజీతో మిస్సెల్​ను సక్సెస్​ఫుల్​గా టెస్ట్​ చేసింది.

తూటాలు, క్షిపణుల వేగాన్ని పెంచి, వాటిని మరింత దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగేలా ఐఐటీ మద్రాస్​ రామ్​జెట్​ టెక్నాలజీని రూపొందించిన సంగతి తెలిసిందే. గాలిని ఆసరాగా చేసుకొని రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పుడు డీఆర్​డీవో మిస్సైల్​కు అమర్చి పరీక్షించింది.

ప్రయోగంలో భాగంగా నాజిల్​లెస్​ బూస్టర్​, ఘన ఇంధనంతో ఉన్న సాలిడ్​ ఫ్యూయల్​ డక్టెడ్​ రామ్​జెట్​ మోటార్​, ఫ్యూయల్​ ఫ్లో కంట్రోలర్​ వంటి అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు గుర్తించారు. ఐటీఆర్​ ఏర్పాటుచేసిన ట్రాకింగ్​ పరికరాలు మిస్సైల్​ను ట్రాక్​ చేసి, ప్రయోగం సక్సెస్​ అయినట్లు తేల్చాయి(DRDO – Ramjet).

కాగా, ‘ఎస్​ఎఫ్​డీఆర్​’ ప్రొపల్షన్​ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో శత్రు దేశాల్లోని టార్గెట్లను, క్షిపణులను మరింత దూరం నుంచే అడ్డుకోగల సామర్థ్యం భారత్​కు సొంతమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>