ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు

కలం, వెబ్ డెస్క్ : ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఉద్యోగులకు కూటమి ప్రబుత్వం తీపికబురు చెప్పింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు స్టాఫ్​ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం కింద ( SRBS) నిధులను తిరిగి చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లింపులు చేసింది. ఇందులో భాగంగా సుమారు 8,450 మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ.75 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో SRBS నిధుల కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది.

కాగా, రిటైర్మెంట్ తర్వాత పింఛన్ కోసం SRBS ను ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ వచ్చారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వేళ ఈ SRBS పథకం రద్దు అయింది. దీంతో తాము దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్​యంలోనే కూటమి ప్రభుత్వం తాజాగా ఈ నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే ఆర్టీసీలో (APSRTC) కొత్త పోస్టుల భర్తీపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే APSRTCలోని వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020లో ఆర్టీసీలో 51,488 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం 44,131 మంది కొనసాగుతున్నారు. వచ్చే మూడేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రవాణా సేవలకు ఇబ్బంది లేకుండా ఖాళీల భర్తీపైన కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Read Also: వైసీపీ vs లోకేశ్‌.. ఎక్స్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>