ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

కలం, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (Singareni) మండల పరిధిలో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు (MLC Voter Registration) చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు (Congress Leader Rambabu) కోరారు. శనివారం భాగ్యనగర్ తండా గ్రామంలో సర్పంచ్ బానోత్ హీరాలాల్‌తో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తోటకూరి రాంబాబు మాట్లాడుతూ.. ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి మద్దతు తెలుపుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>