రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలో రైతు భరోసా!

కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఊపు మీద ఉంది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మంచి ఫలితాలను రాబట్టి అత్యథిక మున్సిపాలిటీలను కైవలం చేసుకుంది. దీంతో సీఎం రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ఈ నెల 17 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడం, ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది.

ఈ పథకం అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ. 9,000 కోట్ల భారీ నిధులను సమీకరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నట్లు సమాచారం. ఎకరానికి రూ. 6,000 చొప్పున అర్హులైన సుమారు 65 లక్షల మందికి పైగా రైతులకు ఈ నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ రైతు భరోసా (Rythu Bharosa)ను ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Read Also: ‘సుప్రీం’ను మెప్పించి పది నిమిషాల్లో ఎంబీబీఎస్​ సీట్​ పట్టేశాడు​!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>