కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ నిన్న శ్రీకాకుళం పర్యటనలో భాగంగా కొందరు వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు మహిళా ఎస్సైపై దాడికి యత్నించడం కలకలం రేపింది. బూర్జ మండల ఎస్సై ప్రవల్లిక నిన్న విధుల్లో ఉన్నప్పుడు పలువురు వైసీపీ కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి, అసభ్య పదజాలంలో దూషించారు.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా అధికారిణిపై దాడికి యత్నించినవారితో పాటు ఆమెపైకి దూసుకెళ్లినవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించింది. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని.. ఆ ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
జగన్ (YS Jagan) పర్యటన నేపథ్యంలో ఎస్సై ప్రవల్లిక తన సిబ్బందితో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత చింతాడ రవికుమార్ (Chintada Ravi Kumar), ఆయన అనుచరులు భారీగా బైక్ ర్యాఓలీ చేపట్టారు. ప్రవల్లిక వారిని అడ్డుకోవడంతో.. ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టారు. మహిళా అధికారిణి అని కూడా చూడకుండా అసభ్యంగా తాకుతూ.. మీదకు దూసుకెళ్లారు. వారిని బలవంతంగా నెట్టేసి, ఎస్సై ప్రవల్లిక (SI Pravallika) అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది.
Read Also: డేటింగ్ యాప్స్‌తో డేంజర్.. యువతకు గైనకాలజిస్ట్ హెచ్చరిక!
Follow Us On : WhatsApp

