epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నల్లగొండలో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్, BRS ఒక్కటై ఏకగ్రీవాల దండయాత్ర!

కలం, నల్లగొండ బ్యూరో : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఉప్పు-నిప్పులా చిటపటలాడే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (Brs) పార్టీలు గ్రామాల్లో మాత్రం దోస్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కలిసిపోతున్నాయి ఈ రెండు పార్టీలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చాలా గ్రామపంచాయతీల్లో గులాబీ, హస్తం పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించుతున్నాయి. రెండు పార్టీలు కలిసి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఈ రెండు పార్టీల జెండాలు ఒక్కటై ఓటర్లను అభ్యర్థిస్తుండడం కనిపిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో విసిగిన ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాలు ఒక్కటిగా కనిపించడం కొత్తగా అనిపిస్తోంది.

దోస్తీ కట్టి పోటీలోకి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, కోదాడ, సూర్యాపేటతో పాటు మరిన్ని నియోజకవర్గాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కోదాడ నియోజకవర్గంలో బేతవోలు, నల్లగొండ నియోజకవర్గంలో చందనపల్లి, మునుగోడు నియోజకవర్గంలో కురంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ కలిసి సర్పంచ్ బరిలో ఉమ్మడి అభ్యర్థిని దింపాయి. ప్రచారం సైతం కలిసే చేస్తున్నాయి. నల్లగొండ మండలంలో BRS, కాంగ్రెస్ మధ్య పంచాయతీ ఎన్నికలు వార్‌ని తలపిస్తున్నాయి. కానీ అదే మండలంలోని చందనపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై పోటీకి దిగాయి. ఇండింపెండెంట్ అభ్యర్థిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కురంపల్లిలోనూ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా చిలూకురు మండలంలోని బేతవోలులోనూ అదే పరిస్థితి.

కొన్ని గ్రామాల్లో అభ్యర్థులే కరువు..

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చాలా గ్రామాల్లో అభ్యర్థులు దొరకడం గగనంగా మారింది. కొన్నిచోట్ల డబ్బులు భారీగా ఖర్చు చేయలేమనే భావన ఒక కారణం కాగా, గతంలో బీఆర్ఎస్ సర్కారు హాయాంలో సర్పంచ్‌లుగా పనిచేసి.. నేటికీ అప్పులు తీరక ఇబ్బందులు పడుతుండడం మరో కారణమని చెప్పాలి. ఆ సర్కారు హయాంలో అప్పులు తెచ్చిమరీ చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు రాక.. తీవ్ర మనోవేదనతో కుంగిపోయారు. ఆ దెబ్బకు మరోసారి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడలేమని చెప్పేస్తున్నారు. పదేండ్ల పాటు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండడం వల్ల గ్రామస్థాయి కాంగ్రెస్ లీడర్లందరికీ ఇదే మంచి అవకాశంగా మారింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్‌లో పోటీ పెరిగింది.

Read Also: ‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’.. కవిత ఆసక్తికర ట్వీట్

Follw Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>