epaper
Monday, March 2, 2026
epaper

సౌదీలో ముస్లిమేతరులకు మద్యం

కలం, వెబ్​డెస్క్​: సౌదీ అరేబియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది దేశంలోని ముస్లిమేతర దౌత్య సిబ్బంది కోసం తొలి మద్యం(Alcohol) దుకాణం ప్రారంభించిన సౌదీ.. నేడు తమ దేశంలో నివసిస్తున్న ముస్లిమేతరులకు కూడా మద్యం అమ్మాలని నిర్ణయించింది. అయితే, నెలకు 50వేల రియాల్​లు (దాదాపు రూ.12లక్షలు) లేదా అంతకుమించి సంపాదన కలిగి, ప్రీమియం హోదా సిటిజన్​షిప్​ ఉన్న విదేశీ ముస్లిమేతరులు మాత్రమే దీనికి అర్హులు. అలాగే గతేడాది దేశంలో తొలి మద్యం (Alcohol) దుకాణం రియాద్​లో ప్రారంభించగా, ఇప్పుడు మరో రెండు నగరాల్లో దుకాణాలు తెరవనుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విదేశీ పెట్టుబడులు, బిజినెస్​ను ప్రోత్సహించడంలో భాగంగా సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహిళల డ్రైవింగ్​పై నిషేధం ఎత్తివేయడం, ప్రజా వినోద, సంగీత కార్యక్రమాలకు అనుమతించడం వంటి నిర్ణయాలను గత కొన్నేళ్లలో సౌదీ ప్రభుత్వం తీసుకుంది. ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీలో ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా ఉన్నాయి.

Read Also: మహాలక్ష్మి పథకం: 2 ఏళ్లు.. 250 కోట్ల రైడ్స్ -సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!