కలం, వెబ్ డెస్క్ : కొత్త నెల ప్రారంభంలోనే వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు తీపి కబురు అందించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరలను భారీగా తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గింపుతో ద్రవ్యోల్బణం భారం కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది.
తాజా సవరణ ప్రకారం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 183.50 రూపాయల తగ్గింపు లభించింది. దీంతో ఢిల్లీ నుండి ముంబై వరకు అన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర 2,930 రూపాయలకు చేరుకుంది. ఈ మారిన కొత్త ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీలు స్పష్టం చేశాయి.
అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, సామాన్యులకు మాత్రం ఎలాంటి మార్పు లేదు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంటి సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

