హీరో అఖిల్​ రాజ్​పై డెలివ‌రీ బాయ్స్ దాడి!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇటీవ‌ల డెలివ‌రీ బాయ్‌పై దాడి చేసి వార్త‌ల్లో నిలిచిన‌ రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) స్టోరీ మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. అఖిల్ రాజ్ దాడితో కక్ష పెంచుకున్న డెలివ‌రీ బాయ్ ర‌మేశ్‌ పెద్ద స్కెచ్ వేశాడు. త‌న స్నేహితుల‌తో క‌ల‌సి అఖిల్ రాజ్‌పై దాడికి ప్లాన్ చేశాడు. కొండాపూర్ ప్రాంతంలోని అఖిల్ ఇంటి స‌మీపంలో కాపు కాసిన రమేశ్‌ ప‌లువురు డెలివ‌రీ బాయ్స్ అత‌డు కుటుంబంతో క‌లిసి గుడికి వెళ్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా కారుపై దాడికి దిగారు. డెలివరీ బాయ్ తన స్నేహితులతో కలిసి వారి కారును అడ్డగించారు.

ఈ ఊహించని ఘటనతో షాక్‌కు గురైన హీరో అఖిల్ రాజ్ వెంటనే కారు స్పీడ్ పెంచి అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే డెలివ‌రీ బాయ్స్ దాడి చేస్తున్న స‌మ‌యంలో వీడియో చిత్రీక‌రించాడు. అనంత‌రం ఈ గొడవపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అఖిల్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి ప్రయత్నించిన ఓ డెలివరీ బాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>