సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు యువతకు ఆదర్శం: కలెక్టర్ సందీప్

కలం, జనగామ: సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sandeep Kumar Jha) జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, అప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. మహనీయుల సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని ఆయన (Sandeep Kumar Jha) ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, ఇంచార్జ్ డి.ఎల్.పి.ఓ వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి జోయ మల్లేష్, డాక్టర్ భిక్షపతితో పాటు బీసీ జేఏసీ ప్రతినిధులు, వసతి గృహ అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

Read Also: నకిలీ ఆభరణాల తాకట్టుతో…రూ.9 లక్షల లోన్ తీసుకున్న కేటుగాళ్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>