Mobile Popup Ad
Mobile Popup Ad

అసమర్ధ మంత్రులు వీరే.. హైకమాండ్‌కు ‘కాంగ్రెస్ ఫ్రెండ్స్’ సంచలన లేఖ..

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర మంత్రులపై వరుస ఫిర్యాదులు, ఆరోపణలు వస్తుండడంతో కాంగ్రెస్ హై కమాండ్‌కు ‘ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ’ (Friends of Congress) సంచలన లేఖ రాసింది. అసమర్ధ మంత్రుల్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీని కాపాడాలని సూచించింది. ఓపెన్ లెటర్ పేరుతో రాసిన ఈ లేఖలో అనేక అంశాలను వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు కాకపోవడం, చాలా వాగ్ధానాలు పెండింగ్‌లోనే ఉండడం, పరిపాలనలో తలెత్తుతున్న లోపాలు, మంత్రులపై వ్యక్తిగతంగా వస్తున్న అవినీతి ఆరోపణలు, పలువురు భూకబ్జాలకు పాల్పడుతుండడం.. వీటన్నింటినీ ఆ లేఖలో ప్రస్తావించింది. అమెరికా నుంచి కాంగ్రెస్ ఎన్నారైలు కొందరు ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారని, ఆ గ్రౌండ్ రిపోర్టులోని అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చి పార్టీని కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రజల్లో తీవ్ర స్థాయిలోనే అసంతప్తి :

వివిధ జిల్లాల్లోని ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉన్నదని ఉత్తర తెలంగాణలో పర్యటించినప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ (Friends of Congress) ఆ లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికైనా అసమర్థ మంత్రులను తొలగించి కాంగ్రెస్‌ను కాపాడాలని కోరింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, జైరామ్ రమేష్ తదితరులను ఆ లేఖలో కోరింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ ప్రజలను నిరాశలోకి నెట్టిందని పేర్కొన్నది. ఆ లేఖలో లేవనెత్తిన అంశాల్లో కొన్ని..

• అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులకు విషయ పరిజ్ఞానం లేదు. పలితంగా విపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారు.
• అటు ఆయా శాఖల అధికారులతో, ఇటు వ్యక్తిగత కార్యదర్శులతో మంత్రులకు సరైన సమన్వయం లేని కారణంగా ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. ప్రజలు వారి సమస్యల కోసం మంత్రుల్ని కలవలేకపోతున్నారు.
• కొద్దిమంది మంత్రులు, వారి అనుచరులు, మంత్రి కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. ఇలాంటి అనైతిక ప్రవర్తనతో ప్రజలకు మంత్రులపై విశ్వాసం సన్నగిల్లింది.
• పరిపాలనాపరంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల స్వాధీనం, హిల్ట్ పాలసీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. ఇలాంటివాటిలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు. కాంట్రాక్టర్లకే ప్రయోజనకరం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జికి కూడా మూసీ ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయం ఉన్నది.
• ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు, కేడర్‌కు తగిన ప్రాధాన్యం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ప్రయారిటీ. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధాలున్నవారితో పార్టీకి చెడ్డపేరు. మంత్రులకు వారి శాఖలకు సంబంధించిన అంశాల్లో విషయ పరిజ్ఞానం ఉండడంలేదు.
• ఇదే విషయాన్ని ఏఐసీసీ నేతలను, పీసీసీ లీడర్లను, కొద్దిమంది మంత్రులను నేరుగా కలిసి వివరించాం.
• పలువురు ఎమ్మెల్యేలు సైతం అసమర్ధ, అవినీతి మంత్రులపై తీవ్రంగానే నెగెటివ్ టోన్‌లో రియాక్ట్ అయ్యారు.
• ఇప్పటికైనా పార్టీకోసం కష్టపడేవారికి ప్రాధాన్యత ఉండాలి. పార్టీని రక్షించుకోడానికి, కాపాడుకోడానికే ఫీల్డు స్థాయిలో తిరిగి ప్రజల అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకురావాలనుకున్నాం.

Read Also:  48 గంటల్లోనే మరో బాంబ్ పేల్చిన ఒరాకిల్.. భారీగా లేఆఫ్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>