ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది: కలెక్టర్ ప్రతిమా సింగ్

కలం, మెదక్ బ్యూరో: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని కలెక్టర్ ప్రతిమా సింగ్ (Pratima Singh) అన్నారు. మెదక్ (Medak) జిల్లాలో మంగళవారం నాటికి 2,65,639.880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 54,885 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. 38,402 మంది రైతుల అకౌంట్లలో రూ.423,52 కోట్లు జమ చేశామని తెలిపారు.

కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>