Mobile Popup Ad
Mobile Popup Ad

పోక్సో కేసులో బండి భగీరథ్ కు పోలీస్ కస్టడీ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు భగీరథ్ ను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను విచారించిన మేడ్చల్ కోర్టు.. అతడిని కస్టడీకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు బండి భగీరథ్ ను 3 రోజుల కస్టడీకి మేడ్చల్ కోర్టు అనుమతినిచ్చింది. కాగా, బాధిత బాలిక తల్లి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావించి మేడ్చల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో మేడ్చల్ కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>