Mobile Popup Ad
Mobile Popup Ad

ఏప్రిల్ 15 నుండి యాసంగి ధాన్యం కొనుగోళ్ళు : కలెక్టర్ ప్రతిమా సింగ్

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లాలో ఏప్రిల్ 15 నుండి యాసంగి (రబీ) సీజన్‌కి సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ (Pratima Singh) పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..  ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమయానికి ధాన్యం కొనుగోలు పూర్తయ్యేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, శ్రీ శిశ సంక్షేమ శాఖల అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించగా.. మెదక్ జిల్లా వ్యాప్తంగా యాసంగి (రబీ) సీజన్‌లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె  తెలిపారు.

Read Also: ఉద్యోగులకు భారీ షాక్.. శాలరీ కటింగ్స్ కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>