రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ కుష్బూ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు మరింతగా విస్తరించేందుకు విస్తృత స్థాయిలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Khushboo Gupta ) పిలుపు నిచ్చారు. మే 15 నుండి జూన్ 15 తేది వరకు నెల రోజుల పాటు నిర్వహించే రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం మహబూబ్‌నగర్ ఐడీఓసీ కాంప్లెక్స్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ (Henry Dunant) చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జె.సువర్ణ రాజ్‌కు మొదటి సభ్యత్వాన్ని అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ (Mahabubnagar Collector) మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖాధికారులు రెడ్ క్రాస్ సభ్యత్వాలను నమోదు చేసుకొని, నెలరోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం స్వీకరించి రెడ్ క్రాస్ సేవా కార్యకమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఐఆర్‌సీఎస్ చైర్మన్ డా.ఎల్.ఎన్.ఏ. నటరాజ్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జె.సువర్ణ రాజ్, జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియా, కార్మిక శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్, ఐఆర్‌సీఎస్ కోశాధికారి జగపతి రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీహరి, తిరుపతి రెడ్డి, డా.సి. బాబుల్ రెడ్డి, జేఆర్‌సీ కోఆర్డినేటర్ అశోక్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: రోడ్లపై నమాజ్.. యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>