మండే ఎండల్లో .. వాతావరణ శాఖ చల్లటి కబురు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత (Telangana Weather) గరిష్ట స్థాయికి చేరిన వేళ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే భానుడి భగభగలతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటికే అండమాన్ సముద్రంలోకి చేరిన నైరుతి మేఘాలు .. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను తాకనున్నాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాల కదిలికకు బాగా సహకరిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రేపు హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, మల్కాజిగిరి, రంగారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. అయితే ఎల్లుండి నుంచి రానున్న వారం రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణం శాఖ తెలిపింది.

Read Also: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>