Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం సేకరణలో ఇబ్బందులుండొద్దు: నిజామాబాద్ కలెక్టర్ త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి, గన్నారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని సదుపాయాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా, ఎలాంటి సమస్యలు తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం జరిపించి, వెంటనే మిల్లులకు పంపించాలని అధికారులకు సూచించారు. రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరిగితే, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. సన్నరకంతోపాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని, తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టర్ వెంట డీ.ఎస్.ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, డీ.ఎ.ఓ వీరస్వామి, ఎ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, ఎంపీడీఓ అనంత్ రావు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>