కలం, వెబ్ డెస్క్: మీడియాలో తనపై వస్తున్న వార్తలపై బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి (Ashu Reddy) స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేసింది. తన అనుమతి లేకుండా తన గురించి తప్పుడు వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. కానీ, కేసుపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అషురెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని, తన దగ్గర రూ.9.35 కోట్లు తీసుకుందని షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ దీనిపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అషురెడ్డి చెల్లెలికి కూడా రూ.50 లక్షల వరకు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అషురెడ్డి కారు, నగలు, ఫ్లాట్‌లు కొనిపించుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తోందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పేరుతో హడావుడి చేసి, తర్వాత ముఖం చాటేశారని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరి అషురెడ్డి దీనిపై ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి.

