విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో : విద్యార్థుల భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చొప్పదండి (Choppadandi) లోని ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, డార్మెటరీ హాల్, భోజనశాల పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. సిబ్బంది హాస్టల్లోనే ఉండాలని.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీపీఓ జగదీశ్వర్, తహసిల్దార్ నవీన్ కుమార్, వార్డెన్ కుమారస్వామి తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>