బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానూ సామూహిక అత్యాచారం కేసులో (Bilkis Bano Gang Rape Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2002 నాటి బిల్కిస్ బానోపై అత్యాచారం, మర్డర్ కేసు నిర్ధారణ అయి 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న బిపిన్‌చంద్ కనైయాలాల్ జోషి, ప్రదీప్ రామన్ లాల్ మోధియాలకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది.

అంతేకాకుండా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. బిల్కిస్ బానూ కేసులో బాంబే హైకోర్టు బిపిన్‌చంద్ కనైయాలాల్ జోషి, ప్రదీప్ రామన్ లాల్ మోధియాలకు దోషులగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్తు వేశారు.

విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇద్దరిలో ఒకరు శారీరకమైన వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. ఇంకొకరు పేరు ఎఫ్ఐఆర్ లో లేదని ఘటన జరిగిన మూడు సంవత్సరాల తరువాత కేసులో (Bilkis Bano Case) ఇరికించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Also Read : సైనికులపై హనీ ట్రాప్.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>