Mobile Popup Ad
Mobile Popup Ad

అప్రమత్తంగా ఉండండి.. కలెక్టర్ భవేశ్ మిశ్రా కీలక ఆదేశాలు!

కలం, నిర్మల్ : భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ.. వర్షాకాలంలో సంభవించే భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నుంచి ముందస్తు జాగ్రత్తల ద్వారా రక్షణ పొందగలుగుతామని అన్నారు. వర్షాకాలం ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, వైద్యారోగ్య, ఆర్ అండ్ బి శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందన్నారు. భారీ వర్షాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని వివరించారు.

ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు, చెరువుల కింద ఉన్న ప్రజలకు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ వాతావరణ వివరాలు, నీటి మట్టపు వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కుంగిన రోడ్లు, గుంతలు, ప్రమాదకర ప్రవాహాలు ఉండే ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి, ఆవైపు ప్రజలెవరూ వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తేముందు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగా సమాచారం చేరవేయాలన్నారు. గర్భిణులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన చికిత్సలకొరకు సంబంధిత ఆసుపత్రుల్లోకి తరలించాలన్నారు.

వరద ముంపు ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల ప్రజలను వరదలు వచ్చే అవకాశం ఉన్న సమయానికి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. రోడ్లు కోతకు గురైతే, విద్యుత్ అంతరాయం కలిగితే ఆ సౌకర్యాల పునరుద్ధరణకు ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు రక్షణపై ఎన్డీఆర్ఎఫ్ బృందం విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డిఎస్పీ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, పాల్గొన్నారు.

Read Also: డెలివరీ బాయ్‌పై ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో దాడి, వీడియో వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>