ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భవిష్యత్తులో సంభవించే ఎలాంటి విపత్తులనైన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందనిజిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అన్నారు. వరద ముప్పు ముంచెత్తితే.. క్షణాల్లో రక్షించే చర్యలపై ‘నల్ల చెరువు’ (Nalla Cheruvu) లో సోమవారం వనపర్తి (Wanaparthy) జిల్లా యంత్రాంగం లైవ్ డెమో నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ఆదేశాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) సూచనల మేరకు మాకు డ్రిల్ నిర్వహించారు. భారీ వరదలు సంభవించిన సందర్భంలో ప్రజలను ఎలా రక్షించాలి, అత్యవసర పరిస్థితుల్లో స్పందనా బృందాలు ఎలా పనిచేయాలనే అంశాలపై ఈ మాక్‌డ్రిల్ చేపట్టారు.

మాక్‌డ్రిల్‌లో భాగంగా వరదల కారణంగా నల్ల చెరువులో ముంపునకు గురై చిక్కుకున్న ప్రజలను ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సురక్షితంగా రక్షించే చర్యలను ప్రదర్శించారు. స్పందనా బృందాలు సమన్వయంతో పనిచేస్తూ బోటు, లైఫ్ జాకెట్ల సాయంతో ప్రజలను రక్షించి, ప్రథమ చికిత్స అందజేసి అంబులెన్సులో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.ఈ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి పరిశీలించి, సహాయక చర్యల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విపత్తులు వచ్చి అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజల్ని ఎలా కాపాడాలని, ఈ అంశంపై మార్క్ డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ శాఖల సంసిద్ధత కోసం ఈ మాక్ డ్రిల్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. వరదలు వచ్చి అత్యవసర పరిస్థితులు ఏర్పడే ఏడు ప్రదేశాలను జిల్లాలో గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు అయితే నల్ల చెరువు ప్రాంతంలో వరద నీటితో అత్యవసర పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, నీటిపారుదల శాఖ, ఇతర ముఖ్యమైన శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలన సంసిద్ధతను ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, డీఎస్పీ గిరి ప్రసాద్, ఇతర జిల్లా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>