Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యంలో కోతలు విధిస్తే సహించేది లేదు.. కలెక్టర్ హెచ్చరిక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైస్ మిల్లర్లు వేగవంతం చేయాలని, ధాన్యంలో కోతలు విధించడానికి వీల్లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. బుధవారం కలెక్టర్ పెబ్బేరు మండలం పరిధిలోని సాయి గోపాల ఇండస్ట్రీస్‌ను సందర్శించి వరి అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మండల పరిధిలోని పాతపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం, చెలిమిల గ్రామ శివారులో మెప్మా వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పలు కీలక సూచనలు చేశారు.

రైతులు ధాన్యం (Paddy) తేమ శాతం నిర్దేశించిన దానికన్నా తక్కువే ఇస్తున్నారని, మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి గోదాముల వద్ద లారీలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించారు. ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్ ద్వారా పీపీసీ ఇన్‌చార్జ్‌లకు పంపించాలని ఆదేశించారు. దీంతో ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తై రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయని తెలిపారు. పాత పల్లి, చెలిమెల గ్రామాల వద్ద వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రశ్నించగా, లారీల కొరత ఉందని చెప్పారు. అదనపు లారీలు పంపి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వరి ధాన్యం తరలింపు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, ఎంపీడీవో ప్రవీణ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>