రేపు మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ

కలం, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి (Union Cabinet Meeting) సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులు హాజరుకానున్నారు. మోదీ 3.0 కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు, మంత్రిత్వ శాఖల పనితీరుపై చర్చించనున్నారు. జూన్ 10న మోదీ 3.0 ప్రభుత్వం రెండేళ్లు పూర్తవుతున్ననేపథ్యంలో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ సెకండ్ వీక్ లో కేబినెట్ విస్తరణ-పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ప్రధాని మోదీ (PM Modi) పూర్తి మంత్రి మండలి సమావేశాలు నిర్వహించినా.. తాజాగా నిర్వహించనున్న సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>