Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యం

కలం మెదక్ బ్యూరో: మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గత రాత్రి గాలివాన బీభత్సం (Heavy Rains) సృష్టించింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం (మం) బహిరన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయి ఇంటిలోని వస్తువులు చెల్లా చెదురుగా పడ్డాయి. చాల ప్రాంతాల్లో కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిచిపోయింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. అల్లాదుర్గంలో రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం నెలకొరిగింది. సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డులో భారీ వర్షం ధాటికి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో, గాలివాన బీభత్సం సృష్టించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంట నేలపాలు అయిందని.. ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>