కలం, వెబ్ డెస్క్: దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) మద్దతుదారులు మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో ఫేమస్ అయి కాక్రోచ్ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉజ్వల్ సింగ్ (Ujjwal Singh) ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తనకు భారత్ అంటే ఇష్టం లేదని, తనకు డబ్బులు వస్తే దేశాన్ని విచిడి వెళ్లిపోతానని చెప్పారు.
దీనిపై హోస్ట్ స్పందిస్తూ మరి కాక్రోచ్ పార్టీ ఉద్యమం సంగతి ఏమిటని ప్రశ్నించగా.. ఉజ్వల్ సమాధానం దాటవేశారు. ఇప్పుడైతే డబ్బులు లేవని, భవిష్యత్తులో డబ్బులు సంపాదించాక తప్పకుండా దేశం విచిడి వెళ్లిపోతానని చెప్పారు. ఉజ్వల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాక్రోచ్ పార్టీది ముమ్మాటికీ విభజన వాదమేనని, అల్లర్లు సృష్టించే దేశ ద్రోహులే ఇందులో భాగస్వాములు అవుతున్నారని ఆరోపిస్తున్నారు. దేశం అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటున్నారని, తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ ఉజ్వల్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

