కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ 52వ పుట్టినరోజు (CM Vijay Birthday) నేడు. తమిళనాడు సీఎం అయిన తర్వాత ఆయన జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో ఆ రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. విజయ్ ఫ్యాన్స్, టీవీకే శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం విజయ్ జన్మదిన వేడుకల నిర్వహణలో తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకతను చాటుకున్నారు.
విజయ్ పుట్టిన రోజు వేళ తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేశారు. సీఎం విజయ్ పుట్టినరోజు నాడే జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహూకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్రం అంతా కూడా ఇలాగే ఫ్రీగా బంగారం ఇస్తే ఎందరికో మేలు జరిగేదని కొందరు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.

