ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు!

క‌లం, వెబ్ డెస్క్: ఖ‌తార్‌ (Qatar)లోని రస్ లఫాన్ బర్టాన్ గ్యాస్‌ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 18 మంది ఆచూకీ గ‌ల్లంత‌య్యింది. మ‌రో 54 మంది గాయపడ్డారు. దోహాకు ఈశాన్యంగా 80 కిలో మీట‌ర్ల‌ దూరంలో ఉన్న రస్ లఫాన్, ఆసియా, యూరప్ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతుల్లో ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్, చైనా, జపాన్, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇలా ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కీలకమైన ప్లాంట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఖ‌తార్ వాణిజ్యానికి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ‌గా మారుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>