డ్రగ్స్‌పై విజయ్ ఉక్కుపాదం.. అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 65 పోలీసు స్టేషన్లను ఈ అవసరం కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం తదితరాలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. చెన్నై, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, సేలం, కోయంబత్తూరు తదితర జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ అవసరం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

స్వయంగా తానే డ్రగ్స్ నియంత్రణ, నివారణ అంశాన్ని పర్యవేక్షిస్తానని తెలిపారు. చెన్నై నగరంలో 12 చోట్ల డ్రగ్స్ కోసమే 12 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న వైన్స్ దుకాణాలను మూసేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్నవారు ఎంతటి స్థాయిలో ఉన్నా సహించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>