Mobile Popup Ad
Mobile Popup Ad

హైకోర్టుకి బండి భగీరథ్.. బెయిల్ పిటిషన్ దాఖలు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) హైకోర్టుని ఆశ్రయించాడు. పేట్ బషీరాబాద్ పీఎస్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో, వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ విచారణకు రానుంది. ఈ నెల 14వ తేదీనే విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

సిట్ ఏర్పాటుతో దర్యాప్తు ముమ్మరం..

బండి భగీరథ్ తనపై అత్యాచారం చేయడమే కాకుండా వేధిస్తున్నాడని ఓ మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. పోక్సో చట్టం ప్రకారం, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు రావడంతో సోమవారం డీసీపీ రితి రాజ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటయింది. అనంతరం, దర్యాప్తు ముమ్మరం అవుతుండటం.. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>