Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు కాళేశ్వరానికి రేవంత్.. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం

కలం, వెబ్ డెస్క్: భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. మ.3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కాళేశ్వరం చేరుకోనున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ రూ.230 కోట్లతో రూపొందించిన కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. సా.4.20 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, మరమ్మతు పనులపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం నస్తూరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సభా వేదిక నుంచే రెండవ విడత రైతు భరోసా నిధులు (Rythu Bharosa) విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల అకౌంట్లలోకే నిధులు రిలీజ్ చేయనున్నారు.

నేడు 45 లక్షలకు పైగామందికి రూ.2,063 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రేవంత్ సర్కార్ రూ.3,590 కోట్లు విడుదల చేసింది. నేటితో రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లోకి నిధులు జమకానున్నాయి. ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఈ పెట్టుబడి సాయం అందుతుంది. ఏప్రిల్ 25 లోపు నిధులు జమ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు మొత్తం రూ. 9 వేల కోట్ల సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>