కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఈ మీటింగ్ ను ‘వికసిత్ భారత్ 2047’ సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే ధ్యేయంతో ఏర్పాటు చేశారు. మోడీ అధ్యక్షతన జరుగనున్న 11వ నీతి అయోగ్ సమావేశంలో తెలంగాణ విజన్-2047, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై రేవంత్ రెడ్డి (CM Revanth) వివరించే అవకాశం ఉంది.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించనున్నారు. సమావేశం ముగిశాక సీఎం పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి మీనాక్షి నటరాజన్ తిరస్కరణ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

