Mobile Popup Ad
Mobile Popup Ad

దేశానికి మహాత్మా గాంధీ, అంబేద్కర్ రెండు కళ్లు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: దేశానికి మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు కళ్లు అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అభివర్ణించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జరిగిన భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి (Ambedkar Jayanti) వేడుకల్లో వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపిస్తే.. ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉందని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలను ప్రపంచం అనుసరిస్తోందని.. విద్య ఒక్కటే మన జీవితాలని మారుస్తుందని అంబేద్కర్ నమ్మారని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనే ప్రజా పాలన విధానమని సభావేదికగా సీఎం స్పష్టం చేశారు. ఆర్టికల్ 3 ద్వారానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. బలమైన దేశంగా భారత్ ఎదగటానికి అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలదే ముఖ్య పాత్ర

తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలే ముఖ్య పాత్ర పోషించాయని సీఎం రేవంత్ అన్నారు. పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న పాత్రను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమనే అన్ని పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందేశ్రీ మనవాడు కాదా? అని ప్రశ్నించారు. ఆనాటి పాలనతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. దళిత బిడ్డ స్పీకర్ గా ఉన్నారని.. బీఆర్ఎస్ లీడర్ అసెంబ్లీకి రాకుండా ఆయన్ని అవమానిస్తున్నారని అన్నారు. దళిత బిడ్డలు ఆర్ధిక మంత్రిగా ఉండొద్దా? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా? అని ప్రశ్నించారు. దళితులను అవమానపరిచిన వాళ్లను ఒకసారి మైక్ ఇవ్వండి అని దళితుడిని అడిగేలా చేసింది ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. అన్ని రంగాల్లో దళిత గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>