కలం, వెబ్ డెస్క్: 2026-27 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నల్లగొండ.. ఇలా అనేక జిల్లాల్లో పాలాభిషేకాలు జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిపారు. ఇంటర్ విద్యార్థులకు (Inter Students) మధ్యాహ్న భోజనం అమలుచేయబోతున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా సీఎం రేవంత్ చిత్రపటాలకు చేసిన పాలాభిషేకం చేసిన ఫొటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

