కలం, నిజామాబాద్ బ్యూరో: ఎప్పుడూ వార్తల్లో ఉండే హనుమంత్ రావు (V Hanumanth Rao).. చాలా రోజుల తరువాత మళ్ళీ హడావిడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో హనుమంతన్న స్టెప్పులేశారు. కామారెడ్డిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వతంత్ర్య వేడుకల్లో ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం బాన్సువాడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన లంబాడీ జాతి నృత్యం చూసి ఆయనకు జోష్ వచ్చింది. ఇంకేముంది స్టేజ్ పై నుండి దిగినచ్చిన ఆయన విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. హనుమంతరావుతో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి కూడా విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. నిజమే మరి హనుమంతన్న ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి మరీ.

