epaper
Wednesday, February 18, 2026
epaper

2029లో కాంగ్రెస్ ను​ మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : 2029లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం నిజామాబాద్​ జిల్లాలో ఆయన పర్యటించారు. మున్సిపల్​ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిచ్ పల్లి మండలం బర్దిపూర్​ శివారులోని కేశపూర్ గ్రామం వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

నిజామాబాద్ కార్పొరేష‌న్ తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌బోతుంది అని ఆయన ధీ వ్యక్తం చేశారు. ఈ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని.. ‘నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ’ అని నినదించిన దాశ‌ర‌థి నిజామాబాద్ బిడ్డ అని చెప్పారు. జిల్లా నుంచి మండ‌వ వెంక‌టేశ్వ‌ర రావు, సుద‌ర్శ‌న్ రెడ్డి లాంటి వాళ్లు మంత్రులుగా ప‌ని చేసినా చిన్న మ‌చ్చ తీసుకురాలేదన్నారు. 12 ఏళ్లు ప్ర‌ధానిగా మోదీ , 10 ఏళ్లు ముఖ్య‌మంత్రి గా కేసీఆర్ ఉన్నా ఈ జిల్లాలో సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ పాలనలో నిజామాబాద్​ చెత్తకుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ వ్య‌వ‌సాయానికి మారు పేరు అని, క్వింటా ప‌సుపు అమ్మితే తులం బంగారం వ‌స్తుంద‌న్న నానుడి ఉండేదని చెప్పుకొచ్చారు. ఇక్క‌డి వ్య‌వ‌సాయం తెలంగాణ‌తో పాటు దేశానికి ఆద‌ర్శం అని సీఎం కొనియాడారు. రైతు స‌మ‌స్య‌ల పైన నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికి ఆద‌ర్శంగా నిలిచిందన్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి , డీ.శ్రీనివాస్ సార‌థ్యంలో 2004, 2009 లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందని గుర్తుచేశారు. 2023 ఎన్నికల్లో తాను పీసీసీ అధ్య‌క్షుడిగా, మ‌హేష్ గౌడ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ను అ ధికారంలోకి తెచ్చామన్నారు. 2029 లో సీఎంగా తాను, పీసీసీ చీఫ్​ మహేష్​ గౌడ్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా బీఆర్​ఎస్​ నాయకులు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు.

Read Also: కిషన్‌రెడ్డి కాదు.. కల్వకుంట్ల కిషన్‌రావు : రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>