కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి చేరుకున్న జగన్, ఇటీవల జరిగిన దాడిలో ధ్వంసమైన ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
జగన్ వస్తున్నారనే సమాచారంతో ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పరిసర ప్రాంతాలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు జనం పోటీ పడటంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఇటీవల జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి, ఫర్నిచర్‌ను తగులబెట్టడంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో జగన్ (YS Jagan) స్వయంగా వచ్చి పరామర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: ఏపీలో పెద్దపులి కలకలం.. ఇళ్లపైకి జనం, కూర్మాపురంలో టెన్షన్ టెన్షన్
Follow Us On: Sharechat


