కలం/ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 18న ఖమ్మం పట్టణం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కావున వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు (రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, అశ్వరావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు) కల్లూరు వైరా నుండి సోమవారం గ్రామం దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి కొడుమూరు దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే దిగి అల్లిపురం కొత్తగూడెం బోనకల్ రోడ్ ధంసలపురం బ్రిడ్జి కింద నుంచి మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి పొన్నికల్లు ద్వారా హైదరాబాద్ వెళ్లాలి. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా,వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగాలి.
ఇక్కడి నుండి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి చర్చి కాంపౌండ్ ముస్తఫా నగర్ అల్లిపురం, కోడుమూరు నుంచి మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి వెళ్లిపోవాలి. సత్తుపల్లి, అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్ రఘునాథపాలెం (ఆపిల్ సెంటర్), లింగాల డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ వెళ్లాలి. ఇల్లందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ నుంచి,ఎస్ఆర్ గార్డెన్ గోపాలపురం గొల్లగూడెం లకారం ద్వారా ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించాలి. వరంగల్ నుంచి ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్, నాయుడుపేట, గాంధీ చౌక్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, అల్లిపురం, కోడుమూరు, మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాలి. ఈనెల 18వ తేదీన ఖమ్మం సిటీ మరియు ఖమ్మం రూరల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని,ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


